వికలాంగుల పెన్షన్ పెంపు ప్రకటన చెయ్యకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తాం – అందె రాంబాబు.
ములుగు జూన్ 18(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో వి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు చంద్రమౌళి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి వి హెచ్ పి ఏస్ జాతీయ కోర్ కమిటి కో చైర్మన్ అందె రాంబాబు,రాష్ట్ర అధ్యక్షులు కాళ్ళ జంగయ్య ముఖ్య అథితులుగా పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 4వేల నుండి 6వేలు వ్రుద్దులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు,గీత కార్మికులకు,బీడి కార్మికులకు 2వేల నుండి 4వేల పించన్ పెంచుతామని చెప్పి 6నెలలు గడుస్తున్న ఇప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు, తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా తెలంగాణలో మహిళలకు ఏవిధంగా ఆర్టీసిలో ఉచితంగా ప్రయాణం చేసే విధంగా చేశారో దివ్యాంగులకు కూడ ఉచితంగా ప్రయాణించే విధంగా క్రుషి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ (పి హెచ్ డి) వయసు మరియు నెట్ (ఎన్ ఇ టి) నుంచి వికలాంగుల అందరికీ మినహాయింపు ఇవ్వాలని శారీరక వికలాంగుల రోస్టర్ 56 ని 10 లోపు మార్చాలని ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇట్టి సమస్యల పరిష్కారం కోసం మంద క్రిష్ణ మాదిగ ఛలో హైద్రాబాద్ కార్యక్రమము కోసం సిద్దంగా ఉండాలని పిలుపు నిచ్చారు. దానికోసం గ్రామ గ్రామాన వి హెచ్ పి ఏస్ గ్రామ కమిటిలు,మండల,కమిటిలు,జిల్లా కమిటిలు, పునర్ నిర్మాణం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు చిట్టి రాజు గారు ఎం ఎస్ పి (మహాజన సోషలిస్టు పార్టీ) జిల్లా అధ్యక్షులు శ్యామ్ మాదిగ జాతీయ నాయకులు ఇరుగుపైడి మహాజన సోషలిస్టు పార్టీ (ఎం ఎస్ పి) నాయకులు నెమలి నరసయ్య మాదిగ వి హెచ్ పి ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు నాగేంద్రమ్మ వి హెచ్ పి ఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లావణ్య జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సుజాత జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సుజాత సహాయ కార్యదర్శి కోమలి సరిత వి హెచ్ పి ఎస్ సీనియర్ నాయకులు కొడాలి సాంబయ్య పోరిక నవీన్ కుమార్ బిక్షపతి నాయక్ భద్రయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.