Praja Kshetram
క్రైమ్ న్యూస్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు..

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు..

 

 

హైదరాబాద్ జూన్ 18 (ప్రజాక్షేత్రం): శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని అగంతకుడు ఎయిర్ పోర్ట్ మెయిల్‌కు బాంబు ఉందని లేఖ పంపాడు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్ పోర్ట్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. “శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇంటెలిజెన్స్ అధికారులకు ఓ అగంతకుడు బాంబు పెట్టామంటూ మెయిల్ చేశాడు. అది చూసిన అధికారులు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన సిబ్బంది అది ఆగతాయి పనిగా తేల్చారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం” అని తెలిపారు. ఒక్కసారిగా సిబ్బంది తనిఖీలు చేయడంతో ప్రయాణికులు హడలిపోయారు.

Related posts