Praja Kshetram
తెలంగాణ

అయ్యప్ప స్వామి ఊరేగింపులో పాల్గొన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

అయ్యప్ప స్వామి ఊరేగింపులో పాల్గొన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

 

 

శంకర్‌ పల్లి జూన్ 18 (ప్రజాక్షేత్రం):శంకర్‌ పల్లి మున్సిపల్ పరిధి అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని విఠలేశ్వర ఆలయం నుండి పట్టణ పురవీధుల గుండా ప్రధాన చౌరస్తా మీదుగా అయ్యప్ప స్వామి ఆలయం వరకు భక్తులు ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి దయతో పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. మహిళలు నృత్యాలు చేశారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్,దండు మోహన్,విష్ణువర్ధన్ రెడ్డి, మిర్యాల శ్రీనివాస్, వాసుదేవ్ కన్నా, మణి గార్డెన్స్ శీను, పాండురంగారెడ్డి, శంభ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, పట్టణ మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Related posts