Praja Kshetram
జాతీయం

పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో పడిందో లేదో ఇలా చెక్‌ చేసుకోండి..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో పడిందో లేదో ఇలా చెక్‌ చేసుకోండి..

 

వారణాసి జూన్ 18 (ప్రజాక్షేత్రం): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 17వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సాయంత్రం ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని కిసాన్ సదస్సులో రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. ప్రధానిగా మూడోసారి మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల ఫైల్‌పై చేశారు. ఈ స్కీం ద్వారా మొత్తం 9 కోట్ల 26 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమచేశారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో వేస్తారు. నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు ఇస్తారు. ఇప్పటివరకు 16 విడతలుగా అన్నదాతల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.32 వేల చొప్పున జమ చేశారు. పీఎం కిసాన్ యోజన పథకం నుంచి లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలి. ఇప్పటికీ ఈ కేవైసీ చేసుకోకుంటే ఇప్పుడైనా చేసుకోవచ్చు. దాని కోసం పీఎం కిసాన్ వెబ్ వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/ కు వెళ్లాలి. ఆ వెబ్ సైట్‌లో లబ్ధిదారుల లిస్ట్ ఉంటుంది. అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు కూడా చేసుకోవచ్చు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమకానున్నాయి. అలా డబ్బులు పడిన వెంటనే మొబైల్‌కు మెసేజ్ రానుంది. ఇప్పటికీ ఈ కేవైసీ పూర్తి చేయని వారిని ఈ జాబితా నుంచి తొలగించారు. అంతే కాదు సరైన పత్రాలు లేకపోయినా, చనిపోయిన రైతులను అనర్హులుగా తేల్చారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది రైతులకు ఈ సాయం ఖాతాల్లో జమవుతోంది. ఈ కేవైసీ సమస్యల వల్ల ఎక్కువ మంది ఈ ప్రయోజనాన్ని మిస్ అవుతున్నారు. ఈ కేవైసీ చేసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.

Related posts