బయన్నగూడ గ్రామ చివరలో ఉన్న డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులు నిలిపివేయాలి.
శంకర్ పల్లి మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ రవీందర్ కు వినతిపత్రం
శంకర్ పల్లి జూన్ 18 (ప్రజాక్షేత్రం): మహాలింగాపురం గ్రామానికి చెందిన చెత్త డంపింగ్ యార్డ్ ను బయన్నగూడ గ్రామ పరిధిలో నిర్మించడం పట్ల పనులు నిలిపివేయాలని గ్రామస్తులు శంకర్ పల్లి మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ రవీందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మహాలింగాపురం గ్రామానికి చెందిన చెత్త డంపింగ్ యార్డ్ ను బయనగూడ గ్రామ పరిధిలో చెత్త వేయడం పట్ల మూడు సంవత్సరాల క్రితం నిలిపి వేశామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా అదే స్థలంలో మళ్ళీ తిరిగి డంపింగ్ యార్డ్ నిర్మాణానికి పూనుకోవడం పట్ల అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ పక్కనే బయన్న గూడ గ్రామస్తుల ఆరాధ్య దైవమైన బయన్న దేవాలయం ఉన్నందున డంపింగ్ యార్డ్ పనులను నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.