బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్… మరో కీలక నేత గుడ్‌బై..!
నేడో రేపో కాంగ్రెస్‌లో చేరిక
హైదరాబాద్ జూన్ 18 (ప్రజాక్షేత్రం): కాంగ్రెస్‌లో కౌన్సిలర్‌గా గెలిచి, బడంగ్‌పేట్ నగర పంచాయతీకి నాలుగేళ్ల పాటు చైర్మన్‌గా వ్యవహరించి.. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ‘అవిశ్వాసం’తో పదవి కోల్పోయిన మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు సామ నర్సింహగౌడ్ హస్తం గూటికి చేరనున్నారు. బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. నేడో రేపో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీఎం సమక్షంలోగానీ, నియోజకవర్గం ఇన్‌చార్జి కేఎల్లార్ సమక్షంలోగానీ ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.