త్యాగం, వారసత్వం, పోరాటం రాహుల్ తత్వం..
హైదరాబాద్ జూన్ 19 (ప్రజాక్షేత్రం): ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు. ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్స్‌లో రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటం అతని వ్యక్తిత్వమని పేర్కొన్నారు. వెనుకబడిన వారికి అండగా ఉండాలనేది ఆయన దృక్పథమన్నారు. త్యాగం, వారసత్వం, పోరాటం ఆయన తత్వమని రాహుల్ అన్నారు. ఆయన తెలివైనవాడని.. భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు రాహుల్ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి రేవంత్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.