ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
ముంబై జూన్ 19 (ప్రజాక్షేత్రం): చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే సురక్షితంగానే ఆ విమానం ముంబైలో నిన్న రాత్రి 10.30 నిమిషాలకు ల్యాండ్ అయ్యింది. ఇండిగో దీనిపై ప్రకటన జారీ చేసింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా విమానం దిగినట్లు ఆ సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. ఇండిగో ఫ్లయిట్ 6ఈ 5149కు బెదిరింపు వచ్చినట్లు తెలిపారు. ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారమే సిబ్బంది వ్యవహరించినట్లు చెప్పారు. అన్ని సెక్యూర్టీ చెక్స్ ముగిసిన తర్వాత విమానాన్ని మళ్లీ టర్మినల్ ఏరియాలో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లోని వడోదరా, బీహార్‌లోని పాట్నా విమానాశ్రయంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ తర్వాత సెక్యూర్టీని పెంచేశారు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి కూడా మంగళవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. బీఎంసీ ఆఫీసును పేల్చివేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. బిల్డింగ్‌లను తనిఖీ చేసిన తర్వాత ఎటువంటి అనుమానిత వస్తువు లేదని నిర్ధారించారు. ముంబైలోని దాదాపు 50 ఆస్పిటల్స్‌కు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. హాస్పిటల్‌లోని బెడ్స్ కింద, బాత్రూమ్‌ల్లో బాంబులు పెట్టినట్లు ఫోన్ చేశారు. జాస్‌లోక్ హాస్పిటల్, రహేజా హాస్పిటల్, సెవన్ హిల్ హిస్పిటల్, కోహినూర్ హాస్పిటల్, కేటీఎం హాస్పిటల్, జేజే హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్‌కు బెదిరింపు వచ్చాయి. వీపీఎన్ నెట్వర్క్ ద్వారా మెయిల్ చేశారని, Beeble.com.అనే వెబ్‌సైట్ నుంచి మెయిల్ వచ్చినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.