రాహుల్ గాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించిన శంకర్ పల్లి నాయకులు
శంకర్ పల్లి జూన్ 19(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ఎంపీ, రాహుల్ గాంధీ జన్మదినాన్ని శంకర్ పల్లి మండలం, మున్సిపల్, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి పి సి సి కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక, రాజకీయ, భారత్ జోడోయాత్ర చేసిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని తెలిపారు. మున్సిపల్ అధ్యక్షులు వై ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ ఎంతో కృషి చేశారని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఐదు ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎజాస్ భాయ్, ఏనుగు రవీందర్ రెడ్డి, అనంతరెడ్డి,కృష్ణారెడ్డి, బల్వంత్ రెడ్డి, తౌఫిక్ , పెంటయ్య, తెలుగు శ్రీనివాస్ ముదిరాజ్, మహబూబ్, దుర్గా ప్రసాద్, ప్రశాంత్, శంకరయ్య, శ్రీకాంత్, మల్లికార్జున్,మైలారం శ్రీనివాస్, తదితర మండల మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు.