సమస్యల వలయంలో చేవెళ్ల ఎస్సీ బాలుర వసతి గృహం
-పెచ్చులు ఊడి పడుతున్న భవనం
-ఎస్ఎఫ్ఐ నాయకుల హాస్టల్ సందర్శన
చేవెళ్ల జూన్ 19 (ప్రజాక్షేత్రం): ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ బాలుర వసతిగృహం భవనం శిథిలావస్థకు చేరి స్లాబ్ పెక్కులు ఊడి కింద పడుతున్నాయని దానికి విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు అలాగే వసతి గృహంలో బోరు పనిచేయడం లేదని నీటి సమస్య కూడా ఉందని విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. కాబట్టి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు హాస్టల్ భవనాన్ని సందర్శించి నూతన భవనం మంజూరు చేయాలని లేదా మరమ్మత్తులు చేయాలని నీటి సమస్య పరిష్కారం చేసే విధంగా చొరవ చూపించాలని అన్నారు లేనిపక్షంలో ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు అల్లి దేవేందర్ వసతిగృహం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.