Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్‌

 

 

అమరావతి జూన్ 19 (ప్రజాక్షేత్రం): ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగానూ పవన్‌ బాధ్యతలు చేపట్టారు. పలు దస్త్రాల పై ఆయన సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపై తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై ఆయన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఐదు శాఖల హెచ్‌వోడీలతో సమీక్ష నిర్వహించారు.

పవనన్‌కు అభినందనలు తెలిపిన మంత్రులు

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్‌కు సోదరుడు నాగబాబు, మంత్రులు, అధికారులు, జనసేన నేతలు అభినందనలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, టీడీపీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు ఉన్నారు.

Related posts