Praja Kshetram
జాతీయం

ఢిల్లీలో వడగాల్పులు.. 192 మంది మృతి

ఢిల్లీలో వడగాల్పులు.. 192 మంది మృతి

 

ఢిల్లీ జూన్ 20 (ప్రజాక్షేత్రం):ఢిల్లీలో వడగాల్పులు 192 మంది మృతి దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వేడిగాలులు వీస్తుండటంతో గడిచిన 72 గంటల్లో ఢిల్లీలో ఐదుగురు మరణించారు. ఇక జూన్ 11 నుండి జూన్ 19 మధ్య ఢిల్లీలో వడదెబ్బ కారణంగా మొత్తం 192 మంది నిరాశ్రయులు మరణించారని ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ అలెడియా గురువారం పేర్కొన్నారు. నోయిడాలో కూడా వడదెబ్బ వల్ల గత 24 గంటల్లో 14మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

Related posts