చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి.
-విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలి.
-ఎంఈఓ భీమ్ సింగ్.
-ఎంపీడీవో జ్యోతిలక్ష్మి.
కొండాపూర్ జూన్ 20 (ప్రజాక్షేత్రం): మండల పరిధిలోని కేజీబీవీ పాఠశాలను గురువారం రోజున ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, ఎంఈఓ భీమ్ సింగ్ పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్, టెస్ట్ బుక్స్, బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలనీ అన్నారు. ప్రభుత్వం విద్య రంగానికి పెద్దపీట వేస్తూ పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం లక్ష్యంగా మంచి విద్యను బోధించడం జరుగుతుందని అన్నారు. ఉచితంగా అందిస్తున్న విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించి వారు కూడా భాగస్వాములు అవ్వాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలలో చేరుతున్నారని గుర్తు చేశారు. అనంతరం కంప్యూటర్ రూమ్, వంటగదిని సందర్శించి విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనాన్ని అందించాలని వారు సూచించారు. ఎప్పటికప్పుడు వంటగదిని శుభ్రం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.