నీట్ పరీక్ష అక్రమాలపై విచారణ జరిపించాలి : భీమ్ భరత్
శంకర్ పల్లి జూన్ 20 (ప్రజాక్షేత్రం) చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామెన భీమ్ భరత్ మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుమేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ నాయకులు మరియు విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు శుక్రవారం నాడు నీట్ పరీక్ష అవకతవతలు గురించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే నీట్ పరీక్షను మరల నిర్వహించాలని తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో యువకులు,విద్యార్థులు, ప్రజలు పాల్గొనవలసిందిగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఎందరో వాళ్ల ఆశలను సహకారం చేసుకోవాలని డాక్టర్లుగా కావాలని తపన పడుతూ విశ్వవిద్యాలయంలో మరియు ఎన్నో నీట్ కోచింగ్ సెంటర్లలో సంవత్సరం వరకు కష్టపడి నీట్ పరీక్ష రాస్తే కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశం మొత్తం కుదిపేస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని భీమ్ భరత్ తెలిపారు. అందుకుగాను కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్షను రద్దు చేస్తూ మరల పరీక్షలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ పరీక్షలలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు మరియు డాక్టర్ కావాలనుకునే పేద మధ్యతరగతి విద్యార్థులు ఎందరో వాళ్ళ కలలను సహకారం చేసుకోవాలని ఎన్నో ఆశలతో నీట్ పరీక్ష రాస్తే కేంద్ర ప్రభుత్వం కుంభకోణాలతో ఒకే వర్గానికి కొమ్ముకాస్తూ దీన్ని సహకరిస్తుందని ఆయన తెలిపారు. అందుకుగాను శుక్రవారం నాడు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉన్నటువంటి విద్యార్థులు యువకులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు అందరూ హాజరు కావలసిందిగా ఆయన కోరారు.