Praja Kshetram
తెలంగాణ

ఎమ్మార్పీఎస్ ఉద్యమం ముప్ఫై ఏళ్ల ప్రస్థానానికి చేరుతున్న సంధర్భంగా జులై 7 న వరంగల్ లో మాదిగల ఆత్మగౌరవ కవాతు

ఎమ్మార్పీఎస్ ఉద్యమం ముప్ఫై ఏళ్ల ప్రస్థానానికి చేరుతున్న సంధర్భంగా జులై 7 న వరంగల్ లో మాదిగల ఆత్మగౌరవ కవాతు

 

-మాదిగల మద్దతు వల్లే బిజేపీ ఓటు శాతం 21%కి పెరిగింది.

-బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడానికి పరోక్షంగా సహకరించింది రేవంత్ రెడ్డే.

-ఎస్సీ వర్గీకరణ అంశం కీలకంగా ఉన్న సందర్బంలో పార్లమెంట్ మాదిగ ఎంపీ లేకుండా చేసిన రేవంత్ రెడ్డి.

-రేవంత్ వల్ల మాదిగలను, బిసిలను కాంగ్రెస్ దూరం చేసుకుంది.

-ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఎస్సీ ఉద్యోగ నియామకాలు చేయొద్దు.

-ఎస్సీ రిజర్వేషన్లను పెంచడం,ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించడం రెండు తక్షణమే జరగాలి.

-ఎస్సీ వర్గీకరణ పట్ల మోదీపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం.

హైదరాబాద్ జూన్ 20 (ప్రజాక్షేత్రం): ఎమ్మార్పీఎస్ 30 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వరంగల్ లో మాదిగల ఆత్మ గౌరవ కవాతును నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా సామాజిక ఉద్యమమైన ఎమ్మార్పీఎస్ మాత్రమే 30 సంవత్సరాల ప్రస్తానానికి చేరుకున్నది. ఎమ్మార్పీఎస్ అధినేత మంద క్రిష్ణ మాదిగ మాట్లాడుతూ

ఎమ్మార్పీఎస్ ముప్ఫై ఏళ్ళు నిలబడానికి రెండు కారణాలు.

1) నిస్వార్థపూరితమైన కార్యకర్తల సంకల్ప బలం.

2) సమాజంలోని అన్ని వర్గాలు అందించిన సహకారం.

ఎమ్మార్పీస్ తమ ఆకాంక్షైన ఎస్సీ వర్గీకరణ సాధన ఉద్యమం తో పాటు సమాజంలో పీడిత వర్గాల సమస్యల పరిష్కారం కోసం కూడా ఉద్యమం చేసుకుంటూ వచ్చింది. ఉద్యమ లక్ష్యాలను ఉద్యమ ఫలాలను ఒక మాదిగలకే కాకుండా సమాజంలో అన్ని వర్గాల పేదలకు ప్రతి కుటుంబానికి వివిధ రూపాల్లో వివిధ పథకాల రూపంగా అందించింది. ఈ ఉద్యమం 30 ఏళ్లు నిలబడ్డది అంటే మాదిగలకే కాకుండా సమాజంలో అన్ని వర్గాల పేదలకు కొన్ని పథకాలు సాధించి పెట్టడంవల్లే. ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ విభాగాల కార్యకర్తల నాయకుల సంకల్ప బలమే మూడు దశాబ్దాల ఉద్యమం నిలబెట్టడానికి దారి తీసింది. అందుకు వారికి అభినందనలు. ఎమ్మార్పీఎస్ చేసే ప్రతి ఉద్యమం ఒక మాదిగలు కోసమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల కోసం చేస్తారనే ఒక నమ్మకం అన్ని వర్గాల ప్రజల్లో, అన్ని రాజకీయ పార్టీలో మేధావుల్లో , ఉండడం వల్ల అన్ని వర్గాలు సంపూర్ణ సహకారాలు ఎమ్మార్పీఎస్ కు అందిస్తూ వచ్చాయి. అందుకు సమాజంలోని అన్ని వర్గాలకు ధన్యవాదాలు. ప్రస్తుతం ఎన్నికల సంగ్రామం ముగిసి నూతన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ బలమున్న ప్రతి చోట బీజేపీని బలపరచుకుంటూ వచ్చాం. తెలంగాణలో బీజేపీకి, దక్షణిది రాష్ట్రాల్లో బిజెపిని, దాని మిత్ర శక్తుల్ని బలపడుతూ వచ్చాం .బిజెపిని బలపరచు వచ్చాం.ఇక్కడ తెలంగాణలో బిజెపికి ఏ పార్టీతో పొత్తు లేదు గనుక డైరెక్ట్ గా బీజేపీ మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో బిజెపికి ఒక మిత్రపక్షంగా ఎమ్మార్పీఎస్ వ్యవహరించింది. ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్లో టిడిపి బిజెపి జనసేన కూటమిని బలపరిచి కర్ణాటకలో బిజెపి జెడిఎస్ కూటమిని బలపరిచింది. తమిళనాడు మొదలుకొని ఎమ్మార్పీఎస్ బలమున్న నిర్మాణపరంగా శక్తి ఉన్న ప్రతి చోట బిజెపిని బిజెపి మిత్ర పక్షాన్ని బలపరుస్తు వచ్చింది. మేము బీజేపీని బలపడ్డానికి బలపరచడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ మీద విశ్వాసం ప్రధాన కారణం.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన నవంబర్ 11,2023 వ నాడు హైదరాబాద్ విశ్వరూప మహాసభకు వచ్చి ఆయన చేసిన వాగ్దానం, మాదిగల ఆవేదనకనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు మాదిగలను కదిలించింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు జూలై 7 వరకు సెలవుల ఉన్ననందున జూలై 7 తర్వాత సుప్రీంకోర్టు సెలవులు అయిపోయిన వెంటనే ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు వస్తుందని ఆశిస్తున్నాను. నరేంద్ర మోడీ మీద నమ్మకంతో ఆయనకు మా శక్తి మద్దతు ఇవ్వాలని తెలంగాణలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు చాలా సవాళ్ళను ఎదుర్కొని బిజెపికి మద్దతు చేసుకుంటూ వచ్చాం. ఎన్నికల విశ్లేషణలో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఓటు పరంగా కొంత బిజెపి వెనుకబడిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఓటు పరంగా సీటు పరంగా కొంత వెనుకబడిపోయింది. దక్షిణాదిలో ఓట్లను సీట్లను బిజెపి పెంచుకుంది.

అందుకు బిజెపి మద్దతుగా ఎమ్మార్పీఎస్ పాత్ర తమ వంతు పాత్ర కూడా పోషించింది.ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ గడ్డమీద బీజేపీ ఓటు శాతం దేశంలో ఎక్కడ పెరిగినంత పెరిగింది. అక్కడక్కడ బిజెపి ఓటు పరంగా నష్టపోతే ఒక శాతం మొదలు ఒక ఐదు శాతం వరకు నష్టపోయిన రాష్ట్రాలు ఉన్నాయి.

అదే సమయంలో లాభపడ్డ చోట ,బలపడ్డ చోట 1 శాతం నుంచి ఒక 5 శాతం వరకు ఓటు పెరిగిన రాష్ట్రాలు ఉన్నాయి.

కానీ తెలంగాణలో దానికి భిన్నంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏడు శాతం ఓటు బ్యాంకు కలిగిన బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఆర్పిఎస్ మద్దతు వల్ల 14 శాతం ఓటు పెంచుకున్నది.

మళ్ళీ మొన్న ఆరు నెలలు తిరగక ముందే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఓటు శాతం 21% పెంచుకుంది. ఆరు నెలలు కాకముందే 21 % ఓటు పెంచుకోవడమే కాకుండా అంతకుముందు ఉన్న నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఇప్పుడు రెట్టింపు స్థాయిలో తెచ్చుకున్నారు.

దేశంలో బిజెపి 21 శాతం పైగా ఓటు పెంచుకున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అనే విషయమే స్పష్టంగా ఋజువు అవుతుంది. దీనికి ఒక మిత్రపక్షంగా ఎమ్మార్పీఎస్ క్షేత్రస్థాయిలో అతి కీలకమైన భూమిక పోషించడం జరిగింది.

బీజేపీకి అండగా నరేంద్ర మోడీ మీద నమ్మకంతో అతికీలకమైన పాత్ర పోషించి ఈ స్థాయిలో బిజెపి ఓట్లు, సీట్లు పెరగడానికి కారణమైంది ఎమ్మార్పీఎస్ మాత్రమే. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఓటు పెరగడానికి బీజేపీకి మిత్రపక్షంగా ఎమ్మార్పీఎస్ మాదిగలను బిజేపికి దగ్గరగా చేయటానికి సహకరించింది రేవంత్ రెడ్డి. మాకు నరేంద్ర మోడీ మీద ఎంత నమ్మకం గౌరవం ఉన్నదో అలాగే కాంగ్రెస్ మీద అంతే కోపం రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారే.

రేవంత్ రెడ్డి ఒక్క సీటు ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ మీద బలంగా మాదిగల వ్యతిరేకత పెరిగింది. పెద్దపల్లి నాగర్ కర్నూల్ ఇటు వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో నూటికి 80% ఎస్సీ లో ఉన్న మాదిగలకు ఈ మూడు స్థానాలు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం ద్రోహం అనేది మాదిగలు అందరు గ్రహించారు. అప్పటికే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్న వివేక కుటుంబంలో వాళ్ళ కొడుకుకు ఎంపీ టికెట్ ఇవ్వడం, డిప్యూటీ సీఎం హోదాలో ఉండబడే మల్లు భట్టి విక్రమార్క కుటుంబంలో సోదరుడికి నాగర్ కర్నూల్ ఇవ్వడం, టిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా దయాకర్ వరంగల్ లో కాంగ్రెస్ లో చేరిన ఆయనకి ఇవ్వకుండాకాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి అసెంబ్లీ మాట్లాడిన కడియం శ్రీహరి కూతురు టికెట్ ఇవ్వడంతో మాదిగల వ్యతిరేకత కాంగ్రెస్ మీద తీవ్ర స్ధాయిలో పెరిగింది.

అది ఈ స్థాయిలో బీజేపీ ఓట్లు పెరగడానికి కూడా కారణమైంది.

రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రత్యక్షంగా మాదిగల్ని మీరు కాంగ్రెస్ చేయాల్సిన అవసరం లేదు మీరు బీజేపీకి వేసుకోండి అని చెప్పినట్లు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఎందుకు ముందుకు ఓట్లు సీట్లు పెంచుకొలేదనే విషయంపై సమీక్ష చేయడానికి మాత్రం వారి అధిష్టానం కమిటీ ఏర్పాటు చేసినట్లుగా నిన్ననే ఒక స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో బలంగా అతిపెద్ద జనాభా గల మాదిగలను దూరం చేసుకుంటే క్రమక్రమమైన మాదిగలు బిజెపి దగ్గర అవుతారని కాంగ్రెస్ కు దూరం అవుతారు అనే విషయం ఇప్పటికైనా కాంగ్రెస్ శ్రేణులు గుర్తుపెట్టుకోకపోతే జరగబోయే నష్టానికి జరగబోయే రేవంత్ రెడ్డి ప్రధాన బాధ్యుడు అవుతాడు.దాన్ని కాంగ్రెస్ పెద్దలే ముందు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్నటి ఎన్నికల్లో బీసీ సమాజం కూడా నరేంద్ర మోడీ వైపు మెజార్టీ ఉన్నట్టుగా కనిపించింది.

దానికి కారణం జనరల్ స్థానాల్లో ఆరుగురు రెడ్ల టికెట్ తెప్పించుకున్న రేవంత్ రెడ్డి అదే జనరల్ స్థానాల్లో 50% కేవలం రెండు స్థానాలు మాత్రమే కేటాయించడం అది కూడా అది కూడా బలంగా లేని చోట్ల మాత్రమే బీసీలకి ఇవ్వడం ఆ రెండు కూడా ఓడిపోవడం జరిగింది. మాకు ఇది కీలకమైన సమయం. సుప్రీంకోర్టు తీర్పు జూలైలో వస్తుందని ఆశిస్తున్నాను. తదిపరి వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రయత్నాలు జరిగే సమయంలో, ఒకవేళ పార్లమెంట్లోనే వర్గీకరణ చర్చ జరిగే సమయానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారి పార్లమెంట్లో మాదిగ లేకుండా రేవంత్ రెడ్డి బలమైన రెండు మాల కుటుంబాలతో కుమ్మక్కై ఒక నమ్మకద్రోహానికి పాల్పడ్డాడు.

తెలంగాణలో ఒక ఎంపీ లేకుండా చేసిన రేవంత్ రెడ్డికి కచ్చితంగా గుణపాఠం నేర్చుకునేలా చేస్తాం.

కాంగ్రెస్ పార్టీ మాకు ఎంత అన్యాయం చేస్తున్నదంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది మాలలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కటి మాదిగలకు ఇవ్వకపోవడం నిదర్శనం.కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఎందుకుదూరమవుతున్నరో బీజేపీకి మాదిగలు ఎందుకు దగ్గర కావాల్సి వస్తుందో స్పష్టంగా అర్థం చేసుకుకోవచ్చు.మాదిగలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది.

కాంగ్రెస్ పార్టీ పద్ధతి మారకపోతే, రేవంత్ రెడ్డి పద్ధతి మారకపోతే రేవంత్ రెడ్డి అధ్యక్షతన, ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోతుంది.తమిళనాడులో ఏ పరిస్థితి వచ్చిందో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఉన్నదో భవిష్యత్తులో తెలంగాణలో అదే పరిస్థితి వస్తుంది. దాన్ని అధిష్టానం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిదిమేము స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంటర్నల్ సమీక్ష చేసుకుంటే , మేము చెప్పే విషయాలు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కోసం లాయర్ ని పెట్టమని చెప్పే ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ రాకముందే ఉద్యోగాల ప్రక్రియ ముందుకు తీసుకెళ్తే మాకు అన్యాయం చేసినట్టే కదా.

ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు, ఎస్సీ రిజర్వేషన్లు పెంచేంతవరకు ఏ నియామకాలు చేపట్టద్దు.

కుల గణన చేయటానికి ఆరు నెలల సమయం తీసుకోవడం సరి కాదు.ఒక రోజులోనే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చే ఆ నివేదికలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు మల్ల కొత్తగా పెట్టి నెలలు తరబడి జాప్యం చేయడం ఎందుకు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లు పెంచకపోతే మేము అంగీకరించమనే మా బీసీ సంఘాల ఆవేదనతో మా బీసీ కులాల ఆవేదనతో మా భాగస్వామ్యం పంచుకుంటాం.

ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచేంతవరకు ఎస్సీ వర్గీకరణ జరిగేంతవరకు ఎలాంటి నియామకాలు చేపట్టొద్దని కోరుతున్నాం. ఎలాంటి స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్ళొద్దని కోరుతున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభం జరుగుతున్న ఈ రోజుల్లోనే అన్ని వర్గాల రిజర్వేషన్లు వెంటనే పెంచి అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.

Related posts