Praja Kshetram
తెలంగాణ

నీట్ పేపర్ లీకేజ్ దోషులను కఠినంగా శిక్షించాలి

నీట్ పేపర్ లీకేజ్ దోషులను కఠినంగా శిక్షించాలి.

 

– కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి.

– ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్ కుమార్

చేవెళ్ల జూన్ 21(ప్రజాక్షేత్రం): ఎస్ఎఫ్ఐ అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా చేవెళ్ల మండల కేంద్రంలో నీట్ పేపర్ లీకేజీ విషయంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ లో బిజెపి నాయకుల హస్తం ఉందని ఈ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు లీకేజి మూలంగా 24 లక్షల కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయన్నారు తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కోచింగ్లు తీసుకొని పరీక్షలు రాస్తే చివరి నిమిషంలో పేపర్ లీకేజీ కుంభకోణాలు జరిగి విద్యార్థుల భవిష్యత్ అంధకారమైందని ఆందోళన వ్యక్తం చేశారు నీట్ పరీక్ష పత్రాలు బీహార్ గుజరాత్ హర్యాన రాష్ట్రాలలో లీకయ్యాయని ఆరోపణలు వచ్చాయన్నారు ముఖ్యంగా రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉంది పేపర్ లీకేజీలో బిజెపి నాయకుల పాత్ర కీలకంగా ఉందని దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం ముక్తకంఠంతో చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయం అన్నారు కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ఎన్ టి ఏ ను రద్దు చేయాలి లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల అధ్యక్షులు గౌలికర్ సాయి గణేష్ సమీర్ హరీష్ ప్రశాంత్ మేఘన మౌనిక స్వప్న నవ్యా తదితరులు పాల్గొన్నారు.

Related posts