చింత ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదిలాం చేయడం సిగ్గుచేటు.
9 ఏళ్ల టిఆర్ఎస్ మేనిఫెస్టో తిరిగేసి చింత చూడాలి.
ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింహులు.
కొండాపూర్ జూన్ 21(ప్రజాక్షేత్రం): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదిలాం చేయడానికి సంగారెడ్డి ఎమ్మెల్యే పూనుకున్నారని ప్రజలు గెలిపించింది అసెంబ్లీలో మాట్లాడటానికి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి అని ఎస్సీ సెల్ కొండాపూర్ మండల అధ్యక్షుడు నర్సింహులు అన్నారు. శుక్రవారం ఆయన కొండాపూర్ మండల పరిధిలోని హరిదాసు పూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు 500 కే గ్యాస్ సిలిండర్ అందించామన్నారు. ఆగస్టు 15 లోపల రైతులకు రుణమాఫీ చేయడానికి కసరత్తు జరుగుతుందన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయని బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.