Praja Kshetram
క్రైమ్ న్యూస్

నారాయణ కాలేజీ గోడ దూకేందుకు ప్రయత్నించి విద్యార్థి మృతి

నారాయణ కాలేజీ గోడ దూకేందుకు ప్రయత్నించి విద్యార్థి మృతి

 

 

హైదరాబాద్ జూన్ 21 (ప్రజాక్షేత్రం): ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థి మృతిచెందిన విషాద ఘటన హయత్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదం డ్రులు తనను హాస్టల్ ల్లో వేశారంటూ గిరీష్ కుమార్ అనే విద్యార్థి గురువారం అర్ధరాత్రి కళాశాల గొడ దూకేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలోన గోడపై ఉన్న విద్యుత్ తీగలు గిరీష్ కుమార్‌ తలకు తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే, గిరీష్ విగత జీవిగా పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందజేశారు. అనంతరం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమతో ఉన్న గిరిష్ కుమార్ మృతి చెంద డంతో తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు.

Related posts