కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. సముచిత స్థానం కల్పిస్తామన్న రేవంత్
హైదరాబాద్ జూన్ 21 (ప్రజాక్షేత్రం): మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రేవంత్, పోచారం కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నో సేవలందించారు. పోచారం సలహాలు, సూచనలు తీసుకునేందుకు వచ్చాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం సూచనలకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాం. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల సంక్షేమం కోసం పోచారం ఎంతో కృషి చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.