Praja Kshetram
తెలంగాణ

తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్

తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్

 

-వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల

రమేష్వికారాబాద్, జూన్ 21(ప్రజాక్షేత్రం): తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, సిద్ధాంతకర్త, జాతిపిత స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. శుక్రవారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గల ప్రొఫెసర్ స్వర్గీయ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవించిన మహానుభావుడు జయశంకర్ సార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, పి ఆర్ ఎం ప్రధాన కార్యదర్శి నంద కుమార్, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related posts