కవిత కస్టడీ మరోసారి పొడిగింపు..
హైదరాబాద్ జూన్ 21(ప్రజాక్షేత్రం): ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో జులై 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.