మౌలిక వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలు : లక్ష్మీనివాస్
రాజేంద్రనగర్ జూన్ 22 (ప్రజాక్షేత్రం): రాజేంద్రనగర్ మండలంలో బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ (టి ఎస్ ఎస్ ఓ) రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాలలో వసతులను కల్పించాలని అదేవిధంగా మధ్యాహ్నం భోజనంలో నాణ్యమైన ఆహారాన్ని మరియు 480 మంది విద్యార్థులు ఉన్న సరిపడ తరగతి గదులు లేక పాఠశాల ఆవరణలో చెట్ల కింద విద్యాభ్యాసం చేస్తున్నారు అలాగే త్రాగునీరు సమస్య, మూత్రశాలలకు తలుపులు లేక విద్యార్థిని విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత చదువులకు పేద విద్యార్థుల భవిష్యత్తు దిశానిర్దేశం చేసే దశలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల వంశీ, రాష్ట్ర నాయకులు సుదర్శన్ రాజేంద్రనగర్ మండల కమిటీ తదితరులు పాల్గొన్నారు.