Praja Kshetram
తెలంగాణ

టైటానిక్ షిప్‌లా బీఆరెస్ మునిగిపోతుంది … బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు వ్యాఖ్యలు

టైటానిక్ షిప్‌లా బీఆరెస్ మునిగిపోతుంది … బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు వ్యాఖ్యలు

 

 

 

హైదరాబాద్ జూన్ 22 (ప్రజాక్షేత్రం): తెలంగాణ రాజకీయాల్లో బీఆరెస్ పార్టీ టైటానిక్ షిప్ లా మునిగిపోతుందని.. ఆ పార్టీ ప్రస్థానం చరిత్రలో రాసుకోవాల్సిందేనని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆరెస్‌ అగ్రనేతలు కేసీఆర్‌, హరీష్ రావు, సహా ఎవరొచ్చిన బీజేపీలో చేర్చుకుంటామన్నారు. బీఆరెస్‌కు సీఆర్ఎస్ (కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం) ఖాయమని అన్నారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు. భవిష్యత్తు రాజకీయాలపై అవగాహాన లేని వారే కాంగ్రెస్‌లో చేరుతారని, బీఆరెస్ నుంచి వెళ్లే ఎమ్మెల్యేలకు తాత్కాలిక ప్రయోజనాలే మిగులుతాయన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ టెక్నికల్ గా మాత్రమే రద్దు అయ్యిందని, ఐటీఐఆర్ గురించి తెలిస్తే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. జగ్గారెడ్డి పెరిగింది ఆర్ఎస్ఎస్‌లోనని.. ఆయన మొదట గెలిచింది బీజేపీ నుంచే అని గుర్తుచేశారు.

Related posts