Praja Kshetram
జాతీయం

జేఈఈ అడ్వాన్స్ లో మెరిసిన మోకిలా తండా గిరిజన బిడ్డ  

జేఈఈ అడ్వాన్స్ లో మెరిసిన మోకిలా తండా గిరిజన బిడ్డ

 

 

శంకర్‌ పల్లి జూన్ 23(ప్రజాక్షేత్రం): శంకర్‌ పల్లి మండల పరిధిలోని మోకిల తాండకు చెందిన సభావత్ చందు నాయక్ జేఈఈ అడ్వాన్స్ లో సత్తా చాటాడు. ఎన్టీఏ ఇటీవల ప్రకటించిన ఫలితాలలో ఆల్ ఇండియాలో 407 (ఎస్టీ కేటగిరీ) వ ర్యాంకు సాధించాడు. యూసుఫ్ గూడ లోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాడు. కూకట్ పల్లిలోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. ఇంటర్మీడియెట్ లో 966 మార్కులు సాధించాడు. తండ్రి శంకర్ సెంట్రింగ్ పనిచేస్తుండగా, తల్లి దేవి వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. తమ బిడ్డ మంచి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు శంకర్, దేవిలు ఆదివారం రోజున స్వీటు తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. ఐఐటిలో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నతంగా ఎదగడమే ధ్యేయమని సభావత్ చందు నాయక్ తెలిపాడు.

Related posts