కుత్బుల్లాపూర్‌లో భారీగా గంజాయి పట్టివేత
కుత్బుల్లాపూర్ జూన్ 23 (ప్రజాక్షేత్రం): కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. బాచుపల్లి ఎక్స్‌రోడ్డులో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. వారి దగ్గర మొదటగా 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో ఖాజీపల్లిలోని స్థావరంలో సోదాలు చేశారు. అక్కడ దాచిన 76 కేజీల గంజాయి, 2 ఆటోలు, 1 బైక్ , 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 80 కేజీల విలువ చేసే రూ. 22 లక్షల వరకు సరుకు ఉంటుందని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ వెల్లడించారు.