Praja Kshetram
తెలంగాణ

ఎస్పీని సస్పెండ్‌ చేయాలి

ఎస్పీని సస్పెండ్‌ చేయాలి

 

 

-ఎమ్మార్పీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివమాదిగ డిమాండ్‌

 

కొల్లాపూర్‌, జూన్‌ 23 (ప్రజాక్షేత్రం): గడిచిన పది రోజుల క్రితం కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లి గ్రామంలో చెంచు మహిళపై జరిగిన దాడి, అదే కుటుంబానికి చెందిన చెం చు నాగన్న హత్య విషయం మీద స్పందించకుండా నిం దితులకు వత్తాసుగా ఉన్న జిల్లా పోలీస్‌ ఎస్పీని సస్పెం డ్‌ చేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివమాదిగ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మొలచింతలపల్లి భ్రమరాంబ కాలనీలో నాగన్న హత్య జరిగి పది రోజులు గడుస్తున్నా కుటుంబ సభ్యులు హత్య అని చెప్పినా జిల్లా ఎస్పీ నేటి వరకు హత్యా నేరం నమోదు చేయకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. బాధిత మహిళపై దాడి జరిగిన దానిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించార న్నారు. ప్రధాన నిందితులను వదిలేసి వారు మళ్లీ బాధితులను చంపుతామని బెదిరింపులకు గురిచేస్తున్నా పట్టించుకోకపోవడం, నిందితులకే వత్తాసు పలకడం మూలంగా బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతు న్నారన్నారు. దీనంతటికీ కారణం నిర్లక్ష్యంగా వ్యవహరిం చిన పోలీసులపై చర్యలు తీసుకుని ఎస్పీని తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మొలచింతలపల్లి భ్రమరాంబ కాలనీలో ఆదివాసీలకు ఇచ్చిన ఇళ్ల స్థలా లు అన్యాక్రాంతమైనా రెవెన్యూ అధికా రులు పట్టించుకోకపోవడం దారుణమ న్నారు. ఆదివాసీలకు ఇచ్చిన భూముల ను తక్కువ ధరలకు కొనుగోలు చేసి పట్టా మార్పిడి చేసుకున్న వ్యక్తులపై చ ట్టపరమైన చర్యలు తీసుకుని తక్షణమే ఆదివాసి భూ ములను వారికే చెందే విధంగా ప్రభుత్వం చర్యలు చేప ట్టాలని డిమాండ్‌ చేశారు. బాధిత మహిళ ఘటన జరిగి పది రోజులు గడిచినా చట్టప్రకారం ఎక్స్‌ గ్రేషియా అందించాల్సిన రెవెన్యూ అధికారులు స్పందిం చకపోవ డం సిగ్గుచేటని అన్నారు. ఈ విషయంపై స్థానిక త హసీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో నుంచి చెంచులపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, భూముల అక్రమ బదలాయింపుల మీద సీబీ సీఐడీ విచారణ జరిపి నిందితులను శిక్షించాలని కోళ్ల శివమాదిగ డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎర్రమోని యాదగిరి మాదిగ, ఎంఎస్‌పీ జిల్లా నాయకుడు మంద నరసింహ, జిల్లా కో కన్వీనర్‌ బచ్చల కూర లక్ష్మణ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు, నాయకులు శ్రీను, కుర్మయ్య, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Related posts