Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

వంద పడకల ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలి

వంద పడకల ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలి

 

రాయచోటిటౌన, జూన 23 (ప్రజాక్షేత్రం): రాయచోటిలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఆరోగ్య వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ను ఆదివారం మంత్రి స్వగృహంలో కలిసి వినతి పత్రం అందజేసినట్లు అన్నమయ్య జిల్లా ఓబీసీ మోర్చ అధ్యక్షులు రేపన శివప్రసాద్‌ తెలిపారు. స్పందించిన మంత్రి రాయచోటికి వచ్చి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలిస్తానని తెలిపారన్నారు. రాయచోటి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొరతగా ఉన్న వైద్యులను వైద్య సిబ్బందిని నియమించి ఆసుపత్రుల అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యం అందేలా చూడాలని తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్‌యాదవ్‌ను కలిసి శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడవికమ్మపల్లె ఎంపీటీసీ రామరాజు, టీడీపీ నాయకులు రమణనాయుడు, బుల్లెట్‌ శివ, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts