గిరిజనుల అభ్యున్నతికి పోలీసుల తోడ్పాటు
తాండూర్ జూన్ 23 (ప్రజాక్షేత్రం) : గిరిజనుల అభ్యున్నతికి పోలీసులు తోడ్పాటు అందిస్తారని ఏసీపీ రవికుమార్ అన్నారు. ఆదివారం తాండూర్ మండలం నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామంలో రాబిన్ హుడ్ ఆర్మీ దాతల సహకారంతో పోలీసులు గిరిజనులకు సరు కులు పంపిణీ చేశారు. ఏసీపీ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ ఆధ్వర్యంలో గిరిజనులను చైతన్యపరిచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. యువ తను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు నేరాలకు దూరంగా ఉండేలా వారి అభ్యున్నతికి పాల్పడుతున్నామన్నారు. గిరిజన గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా పోలీసుల దృష్టికి తీసుకువస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసు కువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ కిరణ్‌కుమార్, మాదారం ఎస్‌ఐతో పాటు పోలీసులు పాల్గొన్నారు.