దేశ సమైక్యత…సమగ్రత సాధకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ … కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి నివాళి
హైదరాబాద్ జూన్ 23 (ప్రజాక్షేత్రం): దేశ సమగ్రత కోసం సమైక్యత సాధనకు బలిదానం చేసిన మహానీయుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కొనియాడారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్, వర్ధంతి సందర్భంగా కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ 370అర్టికల్‌కు వ్యతిరేకంగా డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఉద్యమించి జమ్మూ కాశ్మీర్ లో అరెస్ట్ చేయబడి, జైల్లోనే బలిదానం కావడం జరిగిందన్నారు. 75ఏండ్ల తర్వాతా ఆయన స్థాపించిన జన్‌సంఘ్ నుంచి ఏర్పడిన బీజేపీ 370 అర్టికల్ రద్దు చేసి శ్యామ్‌ప్రసాద్ జీవితాశయాన్ని నెరవేర్చిందన్నారు.. అలాగే జమ్మూ కాశ్మీర్ లో జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రధాని మోదీ అమలు చేశారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో పార్టీ శ్రేణులు దేశం కోసం పనిచేయాలన్నారు.