Praja Kshetram
తెలంగాణ

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

 

 

ఖమ్మం జూన్ 23 (ప్రజాక్షేత్రం): తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకుని ఆదివారం సాయంత్రం కూసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండల కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రం పైన ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కన్వాయిని ఆపి తన కన్వాయిలోని ఓ వాహనంలో క్షతగాత్రున్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రజలు , క్షతగాత్రుని కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts