Praja Kshetram
తెలంగాణ

కోకాపేటలో రూ.498 కోట్లతో జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌..

కోకాపేటలో రూ.498 కోట్లతో జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌..

 

 

 

హైదరాబాద్‌ సిటీ జూన్ 25 (ప్రజాక్షేత్రం): గ్రేటర్‌ విస్తరణ.. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా కోకాపేటలో 220/132/33 కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌(జీఐఎస్) నిర్మాణానికి ట్రాన్స్‌కో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.498 కోట్లతో పరిపాలన అనుమతిలిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీ సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. 2023 ఏప్రిల్‌ 6న రూ. 519.77 కోట్ల అంచనా వ్యయంతో గతంలో ఉత్తర్వులు ఇవ్వగా, దాన్ని తాజాగా సవరించారు. అంచనా వ్యయం సుమారు రూ. 20 కోట్లు తగ్గించారు. కోకాపేట ఉపకేంద్రం నిర్మాణానికి రూ. 171.85 కోట్లు, కేతిరెడ్డిపల్లి- శంకర్‌పల్లి 220కేవీ నుంచి కోకాపేట వరకు 14 కిలోమీటర్ల దూరం ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్లను మోనోపోల్స్‌తో నిర్మించేందుకు రూ. 136.03 కోట్లు అవుతుందని అంచనా వేశారు. గచ్చిబౌలి- రాయదుర్గం 220 కేవీ నుంచి 10.5 కిలోమీటర్లు కోకాపేట వరకు మోనోపోల్స్‌తో ఓవర్‌ హెడ్‌లైన్లు వేసేందుకు రూ. 109.55 కోట్లు అవుతుందని అంచనాలు రూపొందించారు.

Related posts