Praja Kshetram
పాలిటిక్స్

బీజేపీ రాష్ట్ర పగ్గాల కోసం కమలనాధుల పోటీ … ఢిల్లీలో ఏలేటి

బీజేపీ రాష్ట్ర పగ్గాల కోసం కమలనాధుల పోటీ … ఢిల్లీలో ఏలేటి

 

 

 

ఢిల్లీ జూన్ 25 (ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీలో కాక రేపుతుంది. అగ్రెసివ్ గా పనిచేసే లీడర్ ను నూతన రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్ట్రాంగ్ రీప్లే ఇచ్చారు. స్ట్రీట్ ఫైటర్ కావాలా రియల్ ఫైటర్ కావాలా అని.. ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడినవాడినని సందర్భం వస్తే ఏనుగు కుంభ స్థలాన్నైనా కొట్టగలిగే వాడినని ఘాటుగా ప్రతిస్పందించారు. పార్టీ నూతన అధ్యక్షుడు ఎంపికపై రాజాసింగ్.. ఈటల మధ్య మాటల యుద్ధం ఇలా ఉండగానే అటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు తాను సైతం పార్టీ అధ్యక్షుడు రేసులో ఉన్నానంటూ చెప్పేశారు. కొత్తగా బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్ పెద్దలను కలవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే బీజేపీ హై కమాండ్ అంతిమంగా ఎవరికి రాష్ట్ర కమలదళం సారధ్యం అప్పగిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.

Related posts