Praja Kshetram
తెలంగాణ

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

 

-తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ

హైదరాబాద్ జూన్ 25(ప్రజాక్షేత్రం): జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బూరుగుల నాగేందర్ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రాజేందర్ మాదిగలు కోరారు. మంగళవారం హైదరాబాదులో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో పి ఆర్ ఓ శైలేష్ రెడ్డికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు, హెల్త్ కార్డు మంజూరు చేయడంతో పాటు జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు వీలైనంత త్వరలో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న పత్రికల నిర్వహణకు యాజమాన్యాలకు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. నూతన అక్రిడిటేషన్ కమిటీ లో ప్రతి జిల్లాలో తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం ప్రతినిధిని అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ గా అవకాశం కల్పించాలని అన్నారు. అనంతరం జూలై 7న హైదరాబాదులోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే మాదిగ అమరవీరుల సంస్మరణ సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు సుంచు లింగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు అంకగళ్ల కరుణాకర్, చుక్క అశోక్ ,దుబ్బ నాగేష్ ,పెద్దింటి శ్రీనివాస్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మల్లెపాక కుమార్, రాష్ట్ర నాయకులు బొల్లె రాజన్న, ఒగ్గు సోమయ్య, బోట్ల సదానందం, కంబాలపల్లి రాములు, సూగూరి శ్రీనివాస్, కనుక రవి, మీసాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts