బైండ్ల కుల సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్
షాబాద్ జూన్ 25 (ప్రజాక్షేత్రం): బైండ్ల కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ హైదరాబాద్ జిల్లాల బైండ్ల యువకులకు క్రికెట్ టోర్నమెంట్ ను జిల్లాల వారిగా నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఐదు జిల్లాలకు చెందిన ఆరు టీంలు పాల్గొన్నాయి.ఆరు టీం లకు డ్రా ప్రక్రియ ద్వారా మూడు నాకౌట్ మ్యాచ్ లు నిర్వహించి, నాకౌట్ దశలో గెలిచిన మూడు టీమ్లను డ్రా తీసి ఒక టీంను వికారాబాద్ ను ఫైనల్ కు పంపించడం జరిగింది. హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల మధ్య ఫ్రీ ఫైనల్ మ్యాచ్ జరగగా రంగారెడ్డి జిల్లా ప్రీ ఫైనల్ లో గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లింది ఫైనల్ మ్యాచ్ వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల జట్ల మధ్య రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రంగారెడ్డి జిల్లా జట్టు బైండ్ల యువజన క్రికెట్ టోర్నమెంట్ 2024 కప్ ను అందుకోవడం జరిగింది. వికారాబాద్ జిల్లా జట్టు రన్నరప్ గా మిగిలింది. ఆడిన మూడు మ్యాచ్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన బైండ్ల శివకుమార్ మహాలింగాపురంకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కగా, ఫైనల్ మ్యాచ్ లో మంచి బౌలింగ్ మరియు బ్యాటింగ్ ప్రదర్శననిచ్చిన బైండ్ల చెన్నం రాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను దక్కించుకున్నాడు. ఈ టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర అధ్యక్షులు ఏపూరి రామచందర్, రాష్ట్ర ముఖ్య సలహాదారులు బైండ్ల కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైండ్ల యాదగిరి,రాష్ట్ర కోశాధికారి బైండ్ల రామక్రిష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బైండ్ల రాములు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి నరసింహులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సునీల్, మరియు శ్రీనివాస్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బైండ్ల జగదీష్, ఐదు జిల్లాల కమిటీ సభ్యులతో సంయుక్తంగా దగ్గరుండి చూసుకున్నారు. ఏపూరి విజయ్ కుమార్ రిటైర్డ్ డి.ఎస్.పి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆటలు ఆడే చదువుకునే యువతి యువకులకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ప్రోత్సహించడం జరిగింది. బహుమతుల ప్రధాన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్కు బైండ్ల యువకుల నుండి మేము అనుకున్న దానికంటే అధికంగా హాజరు కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్షులు ఏపూరి రామచందర్ మాట్లాడుతూ బైండ్ల కుల సంఘం తెలంగాణ బైండ్ల కులంలోని పిల్లలు యువకులు, పెద్దలు మహిళలు వృద్ధుల వరకు ప్రతి వారి యోగక్షేమాల కోసం తమ వంతు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేశారు బైండ్ల యువతి యువకులు అందరూ ఆటలు ఆడుకుంటూనే చదువు పైన కూడా దృష్టి పెట్టి భవిష్యత్తు లక్ష్యాన్ని తనకు ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎంచుకొని దానిని సాధించేవరకు వదలకూడదని ఉద్యోగం రాని చదువులు ఎన్ని ఉన్న వృధాయేనని ఈ విషయాన్ని అర్థం చేసుకొని జీవితంలో ఉన్నత స్థానాలలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు పలికారు.