ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులను చిన్నచూపు చూస్తున్నారు..మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ జూన్ 25 (ప్రజాక్షేత్రం): వికలాంగుల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ చేయుత పథకం పేరుతో పింఛన్ అందుకుంటున్న ప్రతి వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నడు మానవత్వం లేని వారు మాత్రమే వికలాంగుల పట్ల చిన్నచూపు చూస్తారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు మానవత్వం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. చేయుత ఫించన్లు ఆరు గ్యారెంటీల్లో ఉన్నది. ప్రభుత్వం ఏర్పడిన మొదటినెల నుండి చేయుత పెంచన్లు ఎందుకు అందించడం లేదు పెంచుతామని చెప్పిన పింఛన్లు ఎక్కడికిపోతున్నాయి. పెంచుతామన్న పింఛన్లు నెలకు 896 కోట్ల రూపాయలు 7 నెలలుగా అమలు చేయలేదు రేవంత్ సర్కార్ వచ్చాక పాత పింఛన్లు లేవు పెంచిన పింఛన్లు లేవు ఈ ఏడూ నెలలుగా చేయూత పింఛన్లు 6300 కోట్లు అందాలి వీరందరికి బకాయిలు ఉన్నట్టే చేయూత పింఛన్లు ఎగ్గొడితే ఊరుకొనే పరిస్థితి లేదు ఒకటో తేదీ నుండి 5 వ తేదీ వరకు పింఛన్లు చెల్లించాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 1 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు ఫించన్లు పడేవి రేవంత్ సర్కార్ లో మాత్రము ఎందుకు ఈ ఆలస్యం ఇదేం ప్రభుత్వం రేవంత్ సర్కార్ పట్ల వికలాంగులు,వృద్ధులు ,ఒంటరి మహిళలు రేవంత్ సర్కార్ కి బుద్ధి చెబుతారు. జులై 1 నుండి 2 వ తేదీ లోపు పింఛన్లు చెల్లించాలి పాత బకాయిలు చెల్లించాలి. ఎమ్మార్పీఎస్,వి ఎహ్ పి ఎస్,ఎం ఎస్ పి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు జులై 5 న వేలాది మందితో మహాధర్నా చేస్తాం జులై 6 నుండి 16 వరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల నిరవధిక దీక్షలు చేస్తాం ఇంకా అమలు చేయకపోతే 17 నుండి 31 వరకు అన్ని మండలాల్లో దీక్షలు ధర్నాలు చేస్తాం అవసరమైతే రోడ్డు దిగ్బంధనం చేస్తాం జులై 3 న అందర్నీ కలుపుకొని వెళ్లడం కోసం హైదరాబాద్ లో జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జులై 4 న హైదరాబాద్ మొదలు అన్ని జిల్లాల్లో రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం బీఆర్ఎస్,బీజేపీ,సిపిఐ,సిపిఎం ఆధ్వర్యంలోని వికలాంగుల అనుబంధ సంఘాలను కలుపుకొని వెళతాం జులై 4 న కేసీఆర్ ను నేను స్వయంగా కలిసి ఈ ఉద్యమంలో బాగస్వామ్యం కావాలని కోరుతాను అలాగే కిషన్ రెడ్డి,తమ్మినేని వీరభద్రం,కునంనేని సాంబశివరావు ను కలిసి భవిష్యత్ ఉద్యమానికి ఆహ్వానిస్తాను రేవంత్ సర్కార్ తో తాడోపేడో తేల్చుకుంటాం అన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో వి హెచ్ పి ఎస్ జాతీయ కోఆర్డినేటర్ గోపాల్, జాతీయ అధ్యక్షులు సూజాత స్యూరవంశీ, అందే రాంబాబు, కాళ్ళ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.