ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు పరిచినప్పటికీ పట్టించుకోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు
శంకర్ పల్లి జూన్ 25(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండల పరిధి కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు వేలకు వేలు ఫీజులు చెల్లించడంతో పాటు పుస్తకాలపైనా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు పుస్తకాల పేరుతో వేలకువేలు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి దొపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు పరిచినప్పటికీ పట్టించుకోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇప్పటికి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లన్నీ విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలను ప్రైవేట్ పబ్లిషర్ల తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద భారీగా వసూలు చేస్తున్నారు దీంతో స్కూల్ ఫీజుతో పాటు పుస్తకాల కోసం అదనంగా ఏడాదికి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు చెల్లించాల్సి వస్తుంది.విద్యార్థుల తల్లిదండ్రులు కార్పొరేట్ మాఫియా చేతుల్లో ప్రైవేట్ విద్య చితికిపోతున్న మధ్యతరగతి కుటుంబాలు ఫీజులతోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బుక్స్‌బ్యాగ్, క్యారేజీ బ్యాగ్, బూట్లు, యూనిఫామ్ అమ్మడం పైన నిమగ్నమయ్యాయి.ప్రైవేట్ స్కూల్లో విషయంలో ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా ప్రయోజనం లేకుండా పోతుంది. యూనిఫామ్స్, బుక్స్, నోట్ పుస్తకాలకు ఇబ్బడిముబ్బడిగా బిల్లులు వేస్తున్నారు. ఇవన్నీ తమ వద్దనే కొనాలని హుకూం జారీ చేస్తున్నాయి. వాటిని తమ పాఠశాలల్లోనే కొనాలని చెప్పి ఫీజులకు, పుస్తకాలకు లింకు పెడుతున్నారు. మరికొన్నిచోట్ల నోటుపుస్తకాలు, యూనిఫాం తమ వద్దనే కొనాలని ఆదేశిస్తూ చివరకు ఫీజుకట్టడం తప్పనిసరి చేస్తున్నాయి.