Praja Kshetram
తెలంగాణ

ఉద్యోగులు, ఉపాధ్యాయుల స‌మ‌స్య‌ల‌పై సుదీర్ఘ చ‌ర్చ‌.. సీఎం రేవంత్ రెడ్డికి త్వ‌ర‌లో నివేదిక‌

ఉద్యోగులు, ఉపాధ్యాయుల స‌మ‌స్య‌ల‌పై సుదీర్ఘ చ‌ర్చ‌.. సీఎం రేవంత్ రెడ్డికి త్వ‌ర‌లో నివేదిక‌

 

 

హైద‌రాబాద్ జూన్ 25 (ప్రజాక్షేత్రం): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, టీ.జే.ఎస్. అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య సమావేశమయ్యారు.మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో జరిగిన ఈ భేటీలో త్రిసభ్య కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల సమస్యలపై సుధీర్ఘంగా చర్చించారు. కింది స్థాయి నుంచి ఉన్నత ఉద్యోగి, అధికారి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందిన పలు వినతి పత్రాలను త్రిసభ్య కమిటీ సభ్యులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.ఆయా సంఘాల నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అందిన వినతి పత్రాలపై చర్చించి త్రిసభ్య కమిటీ సభ్యులు ఒక నివేదికను రూపొందించాలని నిర్ణయించింది. ఈ నివేదికను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయాలని కూడా త్రిసభ్య కమిటీ సభ్యులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల సమస్యలపై తరచూ భేటీ కావాలని త్రిసభ్య కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇది ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఈ వర్గాలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ముందుకు సాగుతామని డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు.

Related posts