*కొండాపూర్ మండలం పంచాయతీ సెక్రెటరీల అధ్యక్షునిగా కిషోర్ పవర్.*
*-జనరల్ సెక్రెటరీగా వనజ.*
*-కోశాధికారిగా రవితేజ.*
కొండాపూర్ జూన్ 26(ప్రజాక్షేత్రం): తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ టి పి ఎస్ ఎఫ్ కొండాపూర్ మండలం నూతన కార్యవర్గం ఎన్నికల్లో భాగంగా మరొకసారి టి పి ఎస్ ఎఫ్ కొండాపూర్ మండల అధ్యక్షులుగా కిషోర్ పవర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే జనరల్ సెక్రెటరీగా వనజ ని కోశాధికారిగా రవితేజ ని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కిషోర్ పవర్ మాట్లాడుతూ కార్యదర్శులకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో తోటి పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.