Praja Kshetram
తెలంగాణ

మొయినాబాద్ లో ఏబీవీపీ విద్యాసంస్థల బందు పిలుపు, విజయవంతం*

*మొయినాబాద్ లో ఏబీవీపీ విద్యాసంస్థల బందు పిలుపు, విజయవంతం*

 

*-ఏబీవీపీ స్టేట్ టెక్నికల్ సెల్ కో కన్వీనర్ దేవరాల రాకేష్..*

 

మొయినాబాద్ జూన్ 26 (ప్రజాక్షేత్రం): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మొయినాబాద్ మండలంలో ఏబీవీపీ నాయకులు ఏబీవీపీ స్టేట్ టెక్నికల్ సెల్ కో కన్వీనర్ దేవరాల రాకేష్ మండలంలోని విద్యా సంస్థల బందును విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. గత ప్రభుత్వాలలో ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో అవే సమస్యలు ఇంకా ఉన్నాయన్నారు. పేద మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులు అనేకమంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని పరిస్థితులకు భయపడి వారి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదివించడానికి ముగ్గు చూపుతున్నారు అన్నారు. దీని ఆసరాగా చేసుకొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియకం చేసి గత ప్రభుత్వాల తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలని ఆయన సూచించారు. కావున ఈరోజు బందుకు పిలుపునివ్వడం జరిగింది. మొయినాబాద్ శాఖ పాఠశాల యాజమాన్యాలు సహకరించినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివ, భరత్, సాయి కేశవ్, మనీ, రాకేష్, అఖిల్, సూర్య, చందు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts