గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
*-కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రతినెల సబ్బులు, నూనెలు ఇవ్వని పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలి*
*-సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్*
చేవెళ్ల జూన్ 26 (ప్రజాక్షేత్రం): బుధవారం తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు చేవెళ్ల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీవో సాయిరాం కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు సమయానికి జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా జూన్ మాసం పిల్లల చదువులు పుస్తకాలు కుటుంబ నిర్వహణ ఇలా అనేక ఖర్చులు ఉన్నాయని ప్రభుత్వం మాత్రం వారికి సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు అదేవిధంగా గ్రామపంచాయతీ కార్మికులకు 51 జీవో ప్రకారం 9,500 వేతనం, గుర్తింపు కార్డులు, సబ్బులు, నూనెలు ఇవ్వని పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈఎస్ఐ,పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కనీస వేతనం 26000 నిర్ణయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రత్నం చేవెళ్ల మండల అధ్యక్షులు నరసింహ మొయినాబాద్ మండల అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ షాబాద్ మండల అధ్యక్షులు సత్తయ్య ఉపాధ్యక్షులు నరసింహ, సుధాకర్, మహిళా కన్వీనర్ కవిత, ఉమా భాస్కర్, యాదయ్య, చిట్టి, అర్జున్ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు