ఎయిమ్స్ నుంచి బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ డిశ్చార్జ్
న్యూఢిల్లీ జూన్ 27 (ప్రజాక్షేత్రం): మాజీ ఉప ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. వృధ్యాప్య సమస్యలతో ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో హాస్పిటల్‌లో చేర్పించిన సంగతి తెలిసిందే. 96 ఏళ్ల వయసున్న అద్వానీకి యూరాలజీ, కార్డియాలజీ, గెరియాట్రిక్ మెడిసన్ తదితర వివిధ రంగాల స్పెషలిస్టు వైద్యులు పూర్తిస్థాయిలో పరీక్షలు జరిపారు. చిన్నపాటి శస్త్రచికిత్సను వైద్యులు అద్వానీకి చేసినట్టు ఒక వార్తా సంస్థ తెలిపింది. ‘వయోసంబంధిత సమస్యలతో అడ్మిట్ అయిన అద్వానీ గురువారం డిశ్చార్జ్ అయ్యారు’ అని ఎయిమ్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అద్వానీ ఆరోగ్యం స్థిరంగానే ఉన్నదని, ఆయనను వైద్యుల పర్యవేక్షించారని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.
