అపర్ణ కన్స్ట్రక్చర్ కి సంబంధించిన ప్రహవారి గోడ కూల్చివేయడం జరిగింది : వల్లభ స్వామి గుడి అధ్యక్షుడు శంకర్ నాయక్
శంకర్ పల్లి జూన్ 27(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండలంలో కొండకల్ గ్రామంలో ఉన్నటువంటి అపర్ణ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్నటువంటి ప్రవాహరి గోడను కొండాకల్ గ్రామ సెక్రెటరీ కూల్చి వేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ గతంలో కొండకల్ గ్రామ సెక్రటరీ ప్రహరి గోడ గురించి ఎన్నో నోటీసులు పంపించిన ఎలాంటి ఇలాంటి సమాధానం రాలేదని శంకర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కొండకల్ తండాలకు సంబంధించిన మా పూర్వీకుల బొందలను తోవేసి మా భూములను కబ్జా చేసినటువంటి అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ల జైలు లాంటి గోడలు గోడలు నిర్మించినందుకు కొండకల్ గ్రామ సెక్రెటరీ దగ్గరుండి కూల్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్లు మా లంబాడాలకు సంబంధించిన గుడి భూములు మరియు గతంలో ప్రభుత్వమిచ్చిన వంటి భూములు ఎందరో రాజకీయ పెద్దల ద్వారా ఆక్రమించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. మా కొండకల్ తండా వాసులకు సంబంధించిన గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కి సంబంధించి నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండకల్ గ్రామస్తులు మరియు తండావాసులు పాల్గొన్నారు.