Praja Kshetram
తెలంగాణ

జూలై 7న వరంగల్ వేదికగా జరగనున్న దండోరా 30సం”రాళ ఆత్మగౌరవ కవాతు విజయవంతం చేయండి. 

జూలై 7న వరంగల్ వేదికగా జరగనున్న దండోరా 30సం”రాళ ఆత్మగౌరవ కవాతు విజయవంతం చేయండి.

 

-ప్రజా ఉద్యమాలకు విద్యార్ధి సంఘమే కీలకం…

-ఎం ఎస్ ఎఫ్ తాండూర్ నియోజకవర్గ స్థాయి సమావేశం

-ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ…

తాండూరు జూన్ 27 (ప్రజాక్షేత్రం): గురువారం తాండూర్ పట్టణంలో ఎం ఎస్ ఎఫ్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఎం ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ శివాజీ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కోడిగంటి మల్లికార్జున్ మాదిగ హాజరై మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమం మాదిగల మరియు ఉప కులాల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం సమాన అవకాశాల కోసం ప్రారంభమైన ఉద్యమం… కానీ అంతకు మించి ప్రజలకు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడే మానవీయ ఉద్యమంగా పేరుగాంచిన దండోరా ఉద్యమాన్ని మనం చూసి గర్వపడాలని అన్నారు..ఎన్నో మానవీయ ఉద్యమలు చేసి విజయాలు సాధించి ప్రజలకు ఫలాలకు అందించిన దండోరా ఉద్యమం (1994 నుంచి 2024) జూలై 7నాటికి ఎమ్మార్పీఎస్ ఉద్యమం స్థాపించి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వరంగల్ వేదికగా నిర్వహించబోయే మాదిగ దండోరా 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మగౌరకవాతు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు లక్షలాది మందితో నిర్వహించ బోయే ఈ కవాతుకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మరీ ముఖ్యంగా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని ఎం ఎస్ ఎఫ్ నాయకత్వం క్రియాశీలకంగా పనిచేసి వరంగల్ కు మాదిగ విద్యార్థులను మరియు నిరుద్యోగులను అధిక సంఖ్యలో తరలించడానికి కీలక భూమిక పోషించాలని అట్లాగే ఎం ఎస్ ఎఫ్ సంస్థకతంగా నిర్మాణం చేసుకోవాలని విద్యార్థి నాయకులకు సూచించారు ఈ సమావేశంలో ఎం ఎస్ ఎఫ్ జిల్లా కో కన్వీనర్ అజయ్ మాదిగ , పెద్దేముల్ మండల కన్వీనర్ ఉమాశంకర్ మాదిగ, బషీరాబాద్ మండల కన్వీనర్ రామ్ మాదిగ, యాలాల్ మండల కన్వీనర్ నవీన్ మాదిగ, తాండూర్ మండల కన్వీనర్ పరుశురాం మాదిగ, టౌన్ ఇంఛార్జి శ్రీకాంత్ మాదిగ, నాయకులు నజీర్, వెంకట్ మాదిగ పాల్గొన్నారు.

Related posts