బ్యాంకర్లు నిర్దేశించిన రుణాల లక్ష్యాలను చేరుకోవాలి: జిల్లా కలెక్టర్
3268.21 కోట్ల మంజురుతో 2024-25 జిల్లా వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన కలెక్టర్.
నారాయణపేట జిల్లా జూన్ 27 (ప్రజాక్షేత్రం): బ్యాంకర్లు ప్రజలకు అందించే రుణాల్లో నిర్దేశిoచబడిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్
సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో 2023-24 ఆర్థిక సవత్సరంలో జరిగిన ప్రగతిపై బ్యాంకర్లతో డిసిసి , డి ఎల్ ఆర్ సి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సoదర్భంగా ఆమె 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2024 మార్చి 31 ముగింపు నాటికి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక పై బ్యాంకర్ల తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పి.ఎం.ఈ.జి.పి కింద యూనిట్ లు స్థాపించడానికి అర్హులైన వారికి రుణాలు అందించాలని ఆదేశించారు.గత సంవత్సరం పెoడింగ్ లో ఉన్న దరఖాస్తులను బ్యాంకర్ లు మంజూరు చేయాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఎస్.హెచ్.జి మహిళా సంఘాల సభ్యులకు వ్యక్తిగత,గ్రూప్ ద్వారా వివిధ కార్యకలాపాలకు బ్యాంక్ ల ద్వారా రుణం మంజూరు చేయాలని కోరారు. జిల్లాకు నిర్ణయించిన ఆయా కార్యక్రమాల లక్ష్యం ప్రకారం రుణం మంజూరు చేయాలని సూచించారు.జిల్లాలో బ్యాంకర్లు, జిల్లా అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేసి జిల్లా అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. వ్యవసాయ,ప్రాధాన్యత రంగాలకు ప్రాధాన్యత నివ్వాలని ఆమె సూచించారు.
అనంతరం 3268.21 కోట్ల అంచనాతో రూపొందించిన 2024-25 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. అయితే గత ఆర్ధిక సంవత్సరంలో 23-24 గాను రూపాయలు 1863.95 కోట్లు రుణ మంజూరు చేయడం జరిగిందని, ఇందులో అగ్రికల్చర్ కోసం 1451.57,మరియు ఎం ఎస్ ఎం ఈ రంగానికి గాను 125.79. మంజూరు చేయడం జరిగిందని, అలాగే
ఈ సంవత్సరం 24-25 కు గాను 3268.21 కోట్లు ఇందులో 2768.33 అగ్రికల్చర్ కు మరియు 252.16 కోట్లు ఎం ఎస్ ఎం ఈ రంగానికి కేటాయిస్తూ జిల్లా రుణ ప్రణాళిక ACP 24-25 ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, అర్ బి ఐ ప్రతినిధి గోమతి, నాబార్డు నుండి శ్రీ షణ్ముఖ చారీ, లీడ్ బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, డి ఆర్ డి ఓ రాజేశ్వరి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, ఎస్ బి ఐ ఏ జి ఏం శ్రీ అనిల్ కుమార్, డీ సీ సీ బీ సీ ఈ ఓ లక్ష్మయ్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.