Praja Kshetram
తెలంగాణ

మూత పడిన కచ్చిరెడ్డి గూడ ప్రాథమిక పాఠశాల పున:ప్రారంభం

మూత పడిన కచ్చిరెడ్డి గూడ ప్రాథమిక పాఠశాల పున:ప్రారంభం

 

 

శంకర్ పల్లి జూన్ 27(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండలంలోని మాసానిగూడ గ్రామపంచాయతీ పరిధిలో గల కచ్చిరెడ్డి గూడ ప్రాథమిక పాఠశాల గత దశాబ్ద కాలంగా విద్యార్థులు లేనందును మూత పడడం జరిగింది.రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జీరో ఎన్రోల్మెంట్ బడులను పూన: ప్రారంభించవలసిందిగా కోరగా రాష్ట్ర,మరియు జిల్లా స్థాయి విద్యాధికారుల ఆదేశాల మేరకు గురువారం మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్,మండల నోడల్ ఆఫీసర్ నరహరి,మరియు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ నర్సింగ్ రావు స్థానిక గ్రామ పెద్దలను కలుపుకొని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల కచ్చిరెడ్డి గూడ బడిని పున: ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యాధికారి సయ్యద్ అక్బర్ మాట్లాడుతూ ఉన్నత స్థాయి అధికారుల సూచనల మేరకు మూత వడినటువంటి కచ్చిరెడ్డి కూడా పాఠశాలను స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గ్రామస్తుల సహకారంతో ప్రారంభించడం జరిగిందని, విద్యార్థులు ఇకనుంచి ఎవరు కూడ బడికి దూరం కాకుండ,బాడీడు పిల్లలందరూ బడిలో ఉండేందుకు గాను పాఠశాలను తిరిగి ఓపెన్ చేయడం జరిగిందని,ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా ధనలక్ష్మి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలును నియమించడం జరిగిందని, తల్లిదండ్రులు ఇకనుంచి మీ పిల్లలందరిని క్రమం తప్పకుండ బడికి పంపించాలని,ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచిత పాఠ్య పుస్తకాలు,మధ్యన భోజనం,ఏకరూప దుస్తులు అందించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా గ్రామ పెద్దలు మల్లెపూల శంకరయ్య విద్యార్థులకు పలకలు,బలపాలు,నోటు పుస్తకాలు,పెన్ను,పెన్సిల్లు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహమ్మద్ తాహేర్ అలీ మర్పల్లి అశోక్,సి ఆర్ పి రాజశేఖర్,గ్రామస్తులు నర్సింలు,ఆదిల్,జయనందం,మోయిన్ మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Related posts