Praja Kshetram
తెలంగాణ

ఓమ్నీ వ్యాన్ న‌డుపుతూ.. ఎర్ర‌వ‌ల్లి పొరుగు గ్రామాలను సంద‌ర్శించిన కేసీఆర్..

ఓమ్నీ వ్యాన్ న‌డుపుతూ.. ఎర్ర‌వ‌ల్లి పొరుగు గ్రామాలను సంద‌ర్శించిన కేసీఆర్..

 

 

 

హైద‌రాబాద్ జూన్ 27(ప్రజాక్షేత్రం): బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ న‌డిపిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ న‌డుపుతూ ఎర్ర‌వ‌ల్లి పొరుగు గ్రామాల‌ను సంద‌ర్శించారు. రోడ్ల‌పై క‌న‌బ‌డిన వారిని కేసీఆర్ ఆప్యాయంగా ప‌లుక‌రిస్తూ త‌న వాహ‌నాన్ని ముందుకు పోనిచ్చారు. కేసీఆర్ ప‌లుక‌రింపుతో స్థానికులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఓమ్నీ వ్యాన్ స్టీరింగ్‌ను త‌న చేతుల్లోకి తీసుకుని కేసీఆర్ డ్రైవింగ్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ న‌డుస్తున్నారు. అయితే మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించ‌డంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్ గురువారం న‌డిపారు. గ‌తేడాది డిసెంబ‌ర్ 8వ తేదీ అర్ధ‌రాత్రి కేసీఆర్ కాలు జారిప‌డ్డ సంగ‌తి తెలిసిందే. దీంతో కుటుంబ స‌భ్యులు కేసీఆర్‌ను సోమాజిగూడ‌లోని య‌శోదా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయించారు. కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వ‌హించ‌గా, అది విజయవంతమైంది. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్‌ సాయంతో బీఆర్‌ఎస్‌ అధినేత మెల్లగా అడుగులు వేశారు. ఇక డిశ్చార్జి అయిన త‌ర్వాత కొద్ది రోజుల‌కు క‌ర్ర సాయంతో కేసీఆర్ న‌డిచారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ప్పుడు కూడా క‌ర్ర సాయంతోనే కేసీఆర్ ప్ర‌చారంలో పాల్గొన్నారు. మొత్తానికి కేసీఆర్ కోలుకోవ‌డంతో.. కొద్ది రోజుల నుంచి క‌ర్ర సాయం లేకుండానే న‌డ‌వ‌గ‌లుగుతున్నారు. దీంతో మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించ‌డంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్ గురువారం న‌డిపారు.

Related posts