Praja Kshetram
జాతీయం

బి ఆర్ ఎస్ కు భారీ షాక్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

బి ఆర్ ఎస్ కు భారీ షాక్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

 

 

ఢిల్లీ జూన్ 28 (ప్రజాక్షేత్రం):బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఇటీవల మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం చంద్ర శేఖర్ రావు మాజీ యం పి అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts