Praja Kshetram
తెలంగాణ

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అంతుచిక్కని వైద్యం..

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అంతుచిక్కని వైద్యం..

 

 

నిజామాబాద్ జూన్ 28(ప్రజాక్షేత్రం) నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో సర్వే చేస్తున్న సందర్భంగా వచ్చిన సమస్యలపై సూపర్డెంట్ ప్రతిమ రాజు ఐద్వా జిల్లా కమిటీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన కనీస మెడిసిన్ సదుపాయాలు లేవని అందులో ముఖ్యంగా డోలోఫర్ పారాషూట్ పాన్ టాప్ రాంటాప్ ట్రోమడైల్ అలాగే చిన్న పిల్లలకు సర్ది దగ్గు జ్వరని కి ఇవ్వాల్సిన సిరప్ లు కూడా లేవని గర్భిణీ స్త్రీలకు సంబంధించి స్కానింగ్ సెంటర్లో తప్పుడు రిపోర్టులు రావడం వారికి రక్తస్రావం అవుతున్న కూడా నిర్లక్ష్యం వహించడం వల్ల నిరుపేదలు భయప్రాంతులకు గురై డిశ్చార్జ్ చేయకుండానే ప్రవేట్ హాస్పిటలొ కీ వెళుతున్న పరిస్థితి ఏర్పడుతుంది హాస్పటల్లో పనిచేస్తున్న సిబ్బంది వచ్చిన పేషెంట్స్ తో దురుసుగా ప్రవర్తించడం వల్ల వచ్చిన రోగులు నిరాశ పడతా ఉన్నారు.అలాగే హాస్పటల్లో మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా చెత్త ఉండడం వల్ల ఆస్పత్రిలోకి రాగానే ఒక రకమైన వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అనుకూల విధంగా వైద్యాన్ని అందించాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేశారు.లేదంటే హాస్పటల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఐద్వా మహిళ సంఘం జిల్లా కార్యదర్శి సుజాత హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఏ అనిత జిల్లా ఉపాధ్యక్షురాలు కే లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts