Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

ప‌ల్లా శ్రీనివాస‌రావుకి మంత్రి లోకేష్‌ అభినంద‌న‌లు

ప‌ల్లా శ్రీనివాస‌రావుకి మంత్రి లోకేష్‌ అభినంద‌న‌లు

 

 

 

అమరావతి జూన్ 28 (ప్రజాక్షేత్రం): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. పల్లా శ్రీనివాస్ బాధితుల స్వీకరణ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ నేతలు పాల్గొ్న్నారు. పల్లా శ్రీనివాసుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ప‌ల్లా శ్రీనివాస‌రావు పార్టీకి- ప్రభుత్వానికి మ‌ధ్య వార‌ధిగా ఉంటూ, ప్రజాసంక్షేమానికి కృషి చేయాల‌ని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేత ప‌ల్లా శ్రీనివాస‌రావుని ఎంపిక చేయ‌డం తెలుగుదేశం పార్టీ బీసీల‌కు ఇచ్చే ప్రాధాన్యత‌కు మ‌రో నిద‌ర్శనమని పేర్కొన్నారు. నేత‌లు-కార్యక‌ర్తల‌ను స‌మ‌న్వయం చేసుకుంటూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని నారా లోకేష్ కోరారు.

Related posts