గో బ్యాక్ ఎమ్మెల్యే కాలె యాదయ్య.. నవాబ్ పేటలో కాంగ్రెస్ కార్యకర్తల నిరాహార దీక్ష
నవాబ్ పేట జూన్ 29(ప్రజాక్షేత్రం): చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు వ్యతిరేకిస్తున్నారు. కాలె యాదయ్య చేరికను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేటలో మండల కాంగ్రెస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, కార్యకర్తలు నిరాహార దీక్షకు దిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించిన కాలె యాదయ్య.. ఇప్పుడు అదే పార్టీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా కొండల్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఆయన గతంలో అనేక కేసులు పెట్టించాడని గుర్తుచేశారు. యాదయ్య చేరిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష స్థలానికి పోలీసులు చేరి కొండల్ యాదవ్ ని అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు. నిరహార దీక్షను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామెన భీమ్ భరత్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించేసారు. భీమ్ భారత్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు అభిమానులు అండగా ఉంటానాని అన్నారు.